Breaking News

ఉద్యోగులకు భారీగానే షాక్ ఇచ్చిన కేంద్రం!

21 st Nov 2020, UTC

న్యూఢిల్లీ :కేంద్ర ప్రభుత్వం తాజాగా, ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్ DA పెంపు‌దలను నిలిపివేస్తూ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఉద్యోగులకు ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ వేతన మార్గదర్శకాల ప్రకారమే జీతాలు అందుతాయని ప్రకటించింది. 2020 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఈ రూల్స్ అమలులో ఉంటాయని తాజాగా ప్రకటించింది. 

ప్రస్తుతం కరోనా గడ్డు దినాలలో, సీబీసీఈ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లకు ఐడీఏ వేతన సవరణ మార్గదర్శకాలు వర్తిస్తాయని ఈ ప్రకటన పేర్కొంది. అందువల్ల అక్టోబర్ నెల నుంచి అదనపు అలవెన్స్ ఉండవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్  ప్రకటనలో పేర్కొంది. 2021 జనవరి నుంచి మార్చి వరకు చెల్లించ వలసిన అదనపు డీఏ ఇంస్టాల్మెంట్ లు కూడా చెల్లించబడవని పేర్కొంది. అయితే, ఈ మొత్తాన్ని తిరిగి ఎపుడు చెల్లిస్తారనే నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం పై ఆధారపడి ఉంది. 

ఇక్కడితో అవలేదు. ఉద్యోగులకు మరో బాడ్ న్యూస్ ఏంటంటే, 2020 అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఎలాంటి ఎరియర్స్ ఉండే అవకాశం లేదని కేంద్రం పేర్కొంది. ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ పే స్కేల్ కింద వేతనం పొందే సీపీఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్స్, నాన్ యూనియనైజ్స్‌డ్ సూపర్‌వైజర్స్‌కు ఈ నిర్ణయం అమలు అవుతుంది. సెంట్రల్ డియర్‌నెస్ అలవెన్స్ పే స్కేల్ కింద జీతాలు పొందే వారికి డీఏ ఉండదు. ఏప్రిల్ లోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివలన, 50 లక్షల మంది ఉద్యోగులపై, 61 లక్షల మంది పెన్షనర్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నిబంధన జూన్ 2021 వరకు అమలులో ఉండనుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox