Breaking News

ముఖేష్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్దాల ఎస్ యువి పట్టివేత

25 th Feb 2021, UTC

ముంబైలోని బిలియనీర్ ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా వెలుపల 20 జెలటిన్  స్టిక్స్ తో కూడిన ఎస్‌యూవీ గురువారం కనుగొనబడింది. వదిలివేసిన వాహనాన్ని గురువారం సాయంత్రం అంబానీల భద్రతా సిబ్బంది గుర్తించి  స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గామ్‌దేవి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పలువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్‌యూవీని తనిఖీ చేయడం ప్రారంభించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌ను పిలిచారు. వాహనాన్ని పరిశీలించిన తరువాత, అధికారులు దాని లోపల 20 జెలటిన్ స్టిక్స్ కనుగొన్నారు. అనంతరం డాగ్ స్వ్కాడ్ ను కూడ రప్పించారు.

కారు లోపల జెలటిన్ స్టిక్స్  మాత్రమే ఉన్నాయని అది పేలుడు పరికరం కాదని ముంబయ్ పోలీస్ పిఆర్ వొ తెలిపారు.ఎస్‌యూవీ లోపల కొన్ని నంబర్ ప్లేట్లు కూడా ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వాహనం లోపల ఉన్న నంబర్ ప్లేట్లు ముఖేష్ అంబానీ యొక్క భద్రతా సిబ్బంది ఉపయోగించిన వాహనాలతో సరిపోలినట్లు తెలిసింది.

పేలుడు పదార్థం దొరికిన వెంటనే పోలీస్ కమాండోలు రంగంలోకి దిగారు. మహారాష్ట్ర పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు కూడా కారు దొరికిన ప్రదేశాన్ని సందర్శించారు. అనుమానాస్పద వాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని, ఆ ప్రాంతంలోని సిసిటివిలను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్కాన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నట్లు  మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox