Special Cell: బీహార్‌లో మందుకొడుతూ పట్టబడిన వీఐపీలకు స్పెషల్ సెల్స్

బీహార్‌లో బహిరంగంగా మందుకొడుతూ పట్టుబడిన వీఐపీలను ఉంచడానికి రాష్ట్రప్రభత్వం వీఐపీ సెల్స్ ను నిర్మించింది. ఇందులో రెండు బెడ్స్, సోఫా, టేబుల్, ఎయిర్ కండిషనర్లు ఉంచారు.

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 12:46 PM IST

Bihar: బీహార్‌లో బహిరంగంగా మందుకొడుతూ పట్టుబడిన వీఐపీలను ఉంచడానికి రాష్ట్ర ప్రభత్వం వీఐపీ సెల్స్ ను నిర్మించింది. ఇందులో రెండు బెడ్స్, సోఫా, టేబుల్, ఎయిర్ కండిషనర్లు ఉంచారు. ఈ సెల్స్ లో వీరిని 24 గంటలపాటు ఉంచుతారు. వీరి భద్రత కోసం కుక్కలను కూడ ఉంచుతామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీఐపీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం పై నెటిజన్లు మండిపడ్డారు.

బీహార్ ఏప్రిల్ 2016లో మద్యాన్ని నిషేధించింది. నిల్వ రవాణా, అమ్మకం, వినియోగం మరియు తయారీని శిక్షార్హమైన నేరంగా మార్చింది. నిషేధం తరువాత, మద్యం సేవించడం కోసం మాత్రమే పెద్ద సంఖ్యలో ప్రజలు జైళ్లకు తరలివచ్చారు. మద్య నిషేధం పై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ బీహార్ ప్రభుత్వం పై విమర్శలు చేసిన తర్వాత, నితీష్ కుమార్ ప్రభుత్వం మద్య సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించగా ఏప్రిల్ 1 నుండి అమలు చేయబడింది.

బీహార్ లిక్కర్ ప్రొహిబిషన్ బిల్లు, 2022లోని సవరణ ప్రకారం, మొదటిసారి నేరం చేసినవారు జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత డ్యూటీ మేజిస్ట్రేట్ నుండి బెయిల్ పొందుతారు. అపరాధి జరిమానాను డిపాజిట్ చేయలేని పక్షంలో, అతను/ఆమె ఒక నెల జైలు శిక్షను అనుభవించవలసి ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది.