న్యూఢిల్లీ :సోనియా గాంధీ కాంగ్రెస్ నుంచి తప్పుకోనున్నారన్నవార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సోనియా గాంధీ కూడా పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధం అయిపోయారు. ఈ విషయమై వర్కింగ్ కమిటికి కూడా క్లారిటీ ఇచ్చేసారు. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని సోనియా గాంధీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు సూచనలు చేసారు. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియానే పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. మరో మాజీ కేంద్రమంత్రి ఆంటోనీ ఇలాంటి సమయంలో 23 మంది లేఖ రాయడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు.
ఇటీవల కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేయాలని కోరుతూ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లేఖ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. రాహుల్ గాంధీ కూడా ఈ లేఖను ఖండించారు. ఇలాంటి సమయంలో ఇటువంటి లేఖలు రాయడం సరికాదన్నారు. ఓ వైపు సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఇలాంటి లేఖలకు ఇది వేళ కాదన్నారు. శశి థరూర్, మనీష్ తివారీ, పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా 23 మంది లేఖను రాయడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో పార్టీ నుంచి తప్పుకోవాలని సోనియా భావిస్తున్నారు. మరిన్ని పొలిటికల్ వార్తలు చదవండి.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox