Breaking News

తమిళనాడు శివకాశిలో వరుస పేలుళ్లు..!

25 th Feb 2021, UTC
తమిళనాడు శివకాశిలో వరుస పేలుళ్లు..!

తమిళనాడు శివకాశిలో బాణాసంచా తయారీ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక్కడ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. గత కొన్ని రోజులుగా శివకాశిలో పేలుళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, శివకాశిలో మరో పేలుడు సంభవించింది. ఫలితంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

విరుదునగర్ జిల్లా కాళయ్యర్ కురిచ్చిలో ఫ్యాన్సీ టపాసులను తయారు చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే శివకాశి లో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ పేలుడు వలన దాదాపు పది గదులు నేలమట్టం అయ్యాయని సమాచారం. ఆరుగురు మృతి చెందారు. అయితే, వీరి మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టతరంగా ఉంది. గత రెండు వారాలలో ఇలా పేలుడు జరగడం ఇది మూడవ సారి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox