Breaking News

యోగి సర్కార్ పై శివసేన విమర్శలు..!

06 th Jul 2020, UTC
యోగి సర్కార్ పై శివసేన విమర్శలు..!

ఉత్తరప్రదేశ్‌లోని . గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే గ్యాంగ్ చేతిలో 8 మంది పోలీసులు మరణించడంతో శివసేన పత్రిక సామ్నాలో యోగి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. పోలీసుల మరణాలు ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ యూపీ ప్రభుత్వాన్ని బహిర్గతం చేశాయని, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ గద్దెనెక్కిన తర్వాత ఏం మార్పులు వచ్చాయని  సామ్నా ఎడిటోరియల్ ప్రశ్నించింది.

ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన ఈ మూడేళ్లలో 113 మంది గ్యాంగ్‌స్టర్‌లను మట్టుబెట్టారు. దూబే నిర్మించిన అనధికారిక బంగళా గురించి పోలీసుల మరణం తర్వాత మాత్రమే తెలిసిందని, ఇది దురదృష్టకరమని సామ్నా  ఆవేదన వ్యక్తం చేసింది.  

పొరుగున ఉన్న నేపాల్‌కు   వికాశ్ దూబే పారిపోయాడని తెలుస్తోందని, ఆ దేశంతో మనకు ప్రస్తుతం సంబంధాలు అంతగా బాగోలేవని, ఇలాంటి సమయంలో అతడు రేపు మనకు ‘నేపాల్ దావూద్’ అని నిరూపించుకునే అవకాశం ఇవ్వకూడదని సామ్నా పేర్కొంది.

 ఉత్తరప్రదేశ్‌ను తరచూ ‘ఉత్తమ్ ప్రదేశ్’ చెప్పుకున్నారని, ఇప్పుడా ఉత్తమ్ ప్రదేశ్ పోలీసుల రక్తంలో నాని దేశాన్ని, రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని సామ్నా వ్యాఖ్యానించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox