Breaking News

అస్వస్థతకు లోనైన శశికళ.. ప్రస్తుతం ఆసుపత్రిలో..!

20 th Jan 2021, UTC

అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు. అయితే ఆమె బుధవారం అస్వస్థతకు లోనవడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శశికళ ఆప్తమిత్రురాలన్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న ఆమె శిక్షాకాలం పూర్తి కానుంది. ఆరోజున బెంగళూరు లోని పరప్పన జైలు నుంచి విడుదల కానున్నారు.  అయితే, ఈ కేసులోనే సహచర నిందితురాలు, శశికళ బంధువు ఇళవరసికి మాత్రం మరికొంత కాలం శిక్ష అనుభవించాల్సి ఉంది.

వీరిద్దరూ కాకుండా, మరొకరు మరో బంధువు వీఎన్‌ సుధాకర్ ఫిబ్రవరి 2017 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇళవరసి కంటే శశికళ ముందే అరెస్ట్ అయ్యారు. ఆమె కంటే ముందునుంచే జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఈ లెక్కన శశికళ జైలు జీవితం ఈ నెల 27న ముగియనుంది. జరిమానాలు కింద శశికళ కోర్టుకు పది కోట్ల రూపాయల రుసుము కూడా చెల్లించారు. ఇళవరసి కూడా చెల్లించగా, సుధాకర్ ఇంకా చెల్లించలేదని సమాచారం. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox