Breaking News

పదేళ్లకిందట షారూఖ్ కు రూ.1.5లక్షలు ఫైన్ వేసిన సమీర్ వాంఖడే

27 th Oct 2021, UTC

షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్  బెయిల్‌ ఇప్పటివరకు మూడు సార్లు రిజెక్ట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు అవడంతో ఆర్యన్ కేసు హెడ్ లైన్స్ లో నిలిచింది. మరో వైపు  డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను ఆరెస్ట్ చేసిన ఎన్ సి బి జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే కూడ వార్తల్లో నిలిచారు. ఆయన బాలీవుడ్ ను లక్ష్యంగా చేసుకున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి సమీర్ వాంఖడే బాలీవుడ్ ను లక్ష్యంగా చేసుకున్నారో లేదో తెలియదు. అయితే ఆయన పదేళ్ల కిందటే షారూక్ ఖాన్ రూ.1.5 లక్షలు ఫైన్ చెల్లించేలా చేసారని తెలుస్తోంది.  అది ఎలాగంటే..

 జూలై 2011లో, షారూఖ్ ఖాన్ తన కుటుంబంతో హాలండ్ మరియు లండన్ పర్యటనల తర్వాత ముంబయ్ ఎయిర్ పోర్టులో దిగారు. అపుడు సమీర్ వాంఖడే కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు. షారూఖ్ లగేజిలో 20 బ్యాగులు వున్నాయి. వాంఖడే బృందం అతని లగేజిని తనిఖీ చేసింది.  ఫారిన్ గూడ్స్ కు కస్టమ్స్ డ్యూటీ కట్టి తీరాల్సిందేనని చెప్పారు. దీనికోసం షారూఖ్ ను గంటల తరబడి ప్రశ్నించారు. చివరకు షారూఖ్ ను రూ.1.5 లక్షలు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఆదేశించారు.అంటే షారూఖ్ కుటుంబానికి సమీర్ వాంఖడేతో అనుభవం  పదేళ్లకిందటే ఎదురయిందన్నమాట.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox