Breaking News

తెలుగు అకాడమీ స్కామ్ ఎఫ్ డి లను ఎలా కొల్లగొట్టాలో జైల్లో నేర్చుకున్న సాయికుమార్

13 th Oct 2021, UTC

 తెలుగు అకాడమీకి చెందిన రూ. 64.5 కోట్ల స్కామ్ లో సూత్రధారి చుండూరి వెంకట కోటి సాయి కుమార్ విచారణలో సిసిఎస్ పోలీసులు పలు కీలక అంశాలు గుర్తించారు.  సాయి ఎఫ్‌డీ స్కామ్‌కు సంబంధించిన విషయాలను చెన్నై జైల్లో నేర్చుకున్నట్లు వెల్లడైంది.నార్తర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు సహనిందితులే  వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాదు కు  చెందిన సాయి కుమార్ మొదట స్వాల్‌ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్ వేర్  కంపెనీ ఏర్పాటు చేశాడు.  

దీనికి హైటెక్ సిటీ తో పాటు తమిళనాడులోని చెన్నైలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ప్రాజెక్టుల కోసం ప్రయత్నించినా రాలేదుఈ క్రమంలో అతనికి తమిళనాడు గ్యాంగ్ తోపరిచయమైంది. అప్పటికి ఈ గ్యాంగ్   ఎన్ సి ఎల్  కు చెందిన  ఫిక్సెడ్ డిపాజిట్లపై  కన్నేసింది.చెన్నై లోని పలు బ్యాంకుల్లో ఉన్న రూ. 25 కోట్లు కాజేయడానికి పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాయితో ఒప్పందం చేసుకుంది. ఎన్ సి ఎల్ లిక్విడేట్  చేయగా వచ్చిన రూ. ఆరు కోట్లను స్వాల్ సంస్థ పేరిట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖలోని కరెంట్ అకౌంట్ లోకి మళ్ళించింది.  దీనికోసం సాయికి కోటి రూపాయల వరకు కమీషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నండూరి వెంకట రమణతో సాయికి  పరిచయం ఏర్పడింది. తన స్వస్థలం లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే వెంకటరమణకు ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం ఉంది. ఆ సంస్థకు కావాల్సిన బిల్‌ బుక్స్‌ సహా అన్ని రికార్డులనూ ముద్రించి అందిస్తుంటాడు.  

వీరిద్దరూ మరికొందరితో కలిసి 2012లో ఏపీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ  ఎఫ్‌డీలు,  2015 లో ఏపీ హౌసింగ్ బోర్డ్ ఎఫ్‌డీలు, తాజాగా  తెలుగు అకాడమీ  సొమ్ము కాజేశారు. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల కుంభకోణం నిందితులు 11 ఏళ్లుగా ఈ స్కామ్ లు చేస్తున్నట్లు సిసిఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఏపీలోని ఏపీ హౌసింగ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 10 కోట్లు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ కు చెందిన రూ.5 కోట్లు కొట్టేసి, ఆ డబ్బును ఏపీ మర్కంటైల్ బ్యాంకులోకి  మళ్లించినట్లు నిందితులు వెల్లడించారు.  తెలుగు అకాడమీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox