Breaking News

కేరళ ఏనుగు పోస్టుమార్టం లో దయనీయమైన నిజాలు.., ఓ నిందితుని అరెస్ట్..!

05 th Jun 2020, UTC

కేరళ లో ఓ ఏనుగు నీళ్ళల్లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఏనుగు కళేబరానికి పశువైద్యులు జరిపిన పోస్టుమార్టం నివేదిక ఇటీవల విడుదల అయింది. అయితే.. ఈ నివేదిక లో కీలక నిజాలు వెల్లడయ్యాయి.. మరణించిన ఆ ఏనుగు రెండు వారాల ముందు నుంచి ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. అయితే.. ఆ ఏనుగు నోటి భాగం లో గాయాలు ఉండడం తో.. ఏమి తినలేకపోతోందని తెలిసింది. ఆ ఏనుగు నీళ్లలో మునగడం వల్ల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. గాయపడిన తర్వాత ఏనుగు ఎక్కువ సేపు బతకపోవడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేరళ ప్రభుత్వం..నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
 
         గ ర్భిణీ ఏనుగు మృతి కేసులో పోలీసులు శుక్రవారం ఒకరిని అరెస్ట్ చేశారు. నలభై ఏళ్ల వయసున్న నిందితుడు పేలుడు పదార్థాలను అమ్ముతాడని తెలిసింది. ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్ చేశామని, త్వరలోనే మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని కేరళ అటవీశాఖ మంత్రి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తొలి అరెస్ట్.. 
       
           అయితే.. ఈ వార్తను ప్రచురించిన ఎన్డీటీవీ.. తొలుత మలప్పురం లో జరిగిందని ప్రకటించింది. తరువాత పొరపాటు ను సవరించి పాలక్కాడ్ జిల్లాల్లో జరిగినదని... ఈ పైన్ ఆపిల్ ను ఏనుగే తెలియక తిందని తెలిపింది. మరో వైపు అటవీ శాఖ అధికారులు కూడా ఈ ఘటన కావాలని చేసింది కాదని చెబుతున్నారు. అక్కడి ప్రాంతాల్లో.. పంటలను పాడు చేసే అడవి పందుల్ని అడ్డుకోవడానికి చాలా మంది ఇలాంటి టెక్నిక్ లు వాడుతుంటారట. పొరపాటున వాటి కోసం పెట్టిన పేలుడు పదార్ధాలు ఉన్న పండు ని ఈ ఏనుగు తిని ఉంటుందని  భావిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox