Breaking News

భారత రైల్వే లో అరుదైన రికార్డు..ఒక్కరోజులో 69 కి.మీ. డబ్లింగ్..!

23 rd Oct 2020, UTC

భారత రైల్వే లో ఓ చారిత్రాత్మకమైన ఘటన చోటు చేసుకుంది.. ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్ ను వరదలు , తుపాన్లు ముంచెత్తిన నేపధ్యం లో విజయవాడ-విశాఖపట్నం మార్గానికి మరో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడింది. కేవలం ఒక్కరోజులోనే ఇందుకు సంబంధించిన పనులను రైల్వే పూర్తి చేయగలిగింది. ఉప్పులూరు-గుడివాడ-మోటూరు, గుడివాడ-మచిలీపట్టణం మార్గాల మధ్య డబ్లింగ్ పనులను రైల్వే పూర్తి చేసింది. సుమారు 69 కి.మీ.డబ్లింగ్ పనులను భారత రైల్వే కేవలం ఒక్కరోజులో పూర్తి చేసింది. 

విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపురం , గుడివాడ-మచిలీపట్టణం , నర్సాపురం-నిడదవోలు మార్గాల్లో.. ఇటీవల డబ్లింగ్ పనులు పూర్తి అయ్యి.. ఈ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే..ఈ అభివృద్ధి పనులన్నీ మూడు వేల కోట్లతో చేపట్టిన విద్యుద్దీకరణ పనుల్లో భాగమని రైల్వే పౌర ముఖ్య సంబంధాల శాఖ అధికారి సి హెచ్ రాకేష్ వెల్లడించారు. కొత్త గా అందుబాటులోకి వచ్చిన మార్గాల ద్వారా ఇక పై ఎలాంటి ఇబందులు లేకుండా కోస్తా ఆంధ్ర లోని పంటలను, ఉత్పత్తులను రవాణా చేసుకోవచ్చు. ఈ మార్గాలు ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కి ఎంతగానో దోహదపడతాయి.

ఈ కొత్త మార్గాలు.. కోస్తా ఆంధ్ర ప్రాంతం లోని రాజమహేంద్ర వరం, విజయవాడ, గుంటూరు, విశాఖ పట్టణం, తిరుపతి, నెల్లూరు, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా తదితర ప్రాంతాలకు ప్రయాణాన్ని సుగమం చేస్తుంది.. ఈ డబ్లింగ్ పనుల్లో అత్యాధునిక, భద్రతాపరమైన ఇంజనీరింగ్ విధానాన్ని, డిజైనింగ్ విధానాలను అనుసరించినట్లు రాకేష్ తెలిపారు. గంటకు 110 కి.మీ.వేగం తో ప్రయాణించే విధం గా ఈ మార్గాలను ఏర్పాటు చేసినట్లు రాకేష్ వెల్లడించారు. ఇందులో భాగం గా.. ఉప్పులూరు, గుడివాడ, ఇందుపల్లి, మోటూరు, పెడన, కవుతారం, మచిలీపట్టణం స్టేషన్లను పునర్నిర్మించారు. అలాగే.. క్రాసింగ్ వద్ద.. సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేశామని తెలిపారు.ఓ వైపు కరోనా నిబంధనలను పాటిస్తూ.. సవాళ్లు ఎదుర్కొంటు ఈ పనులను దిగ్విజయం గా పూర్తి చేసిన ఆర్ వి ఎస్ ఎల్, రైల్వే అధికారుల పని తీరుని జి ఎం గజానన్ ప్రశంసించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox