Breaking News

అమెరికా లో కొత్త ఇన్ఫెక్షన్..!

06 th Jul 2020, UTC
అమెరికా లో కొత్త ఇన్ఫెక్షన్..!
                కరోనా మహమ్మారి పరిస్థితి తీవ్రతరం అవుతూనే ఉంది.. రోజు రోజు కి పెరుగుతున్న కరోనా కేసుల తో ఓ వైపు అమెరికా అట్టుడుకుతుంటే.. మరో వైపు.. కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడం తో అధికారుల్లో ఆందోళన నెలకొంది.. ప్రజలను కూడా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తోంది.. నీటి లో ఉండే అమీబా వైరస్ ద్వారా మెదడు కు ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు  హరిస్తోందని గుర్తించారు. 
 
                అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో కరోనా మహమ్మారి తీవ్రం గా ఉన్న సంగతి తెలిసిందే. అసలే కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న అమెరికా కి మరో ముప్పు వచ్చి పడింది. ఫ్లోరిడాలోని ఓ వ్యక్తికి మెదడును హరించే అరుదైన, ప్రాణాంతక అమీబాతో ఇన్ఫెక్షన్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ప్రజలు కూడా అప్రమత్తం కావాలని హెచ్చరించారు. నాగ్లేరియా ఫౌలేరిగా వ్యవహరించే ఈ అమీబా నదులు, చెరువులు, సరస్సులలో, వెచ్చటి తాజా నీళ్లలో ఉంటుంది.. ఈ నీరు ముక్కుకి తాకకుండా జాగ్రత్త పడాలి.. ముక్కు రంధ్రాల గుండానే ఈ అమీబా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎక్కువగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే విస్తృతంగా వ్యాపిస్తుంది.. అని అధికారులు పేర్కొన్నారు. 
                    
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox