Breaking News

రజిని తేల్చేదెన్నడో...?

30 th Nov 2020, UTC
రజిని తేల్చేదెన్నడో...?

చెన్నై :తమిళనాట రాజకీయాల్లో రంగప్రవేశం చేసి ప్రజలకు సాధ్యమైనంతవరకు సేవ చేయాలనేది రజిని కాంత్ కల. దీనిని ఆయన దాదాపు దశాబ్ద కాలంగా కంటూనే ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆయనకు బలంగా కోరిక ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీటిపై రజిని స్పందించింది చాలా తక్కువ. ఇదిగో అదిగో అంటూనే రాజకీయాలపై ఆయన స్పష్టమైన ప్రకటన ఏమి చేయలేదు.

తాజాగా, ఆయన రాజకీయ ప్రవేశమై మళ్ళీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఈరోజు ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో రజిని సమావేశం అయ్యారు. వారితో చర్చలు జరిపిన తరువాత ఆయన రాజకీయ ప్రవేశం విషయమై ఓ ప్రకటన చేస్తారని అంతా భావించారు. చెన్నైలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో వీరు సమావేశం అయ్యారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రజిని ప్రవేశం విషయమై నెలకొన్న సందిగ్ధత ఇప్పటికి తొలగలేదు. 

రాజకీయ పార్టీ విషయమై రజిని ఎలాంటి ప్రకటనను చేయలేదు. రజనీ మక్కల్ మండ్రంతో చర్చలు ముగిసిన తరువాత, సూపర్ స్టార్ రజిని కాంత్ నేరుగా పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆర్ఎంఎం కార్యదర్శులతో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు ఈ సందర్భంగా రజిని తెలిపారు. ఈ సందర్భం ఆర్ఎంఎం  కార్యదర్శులు, నిర్వాహకులు పలు సమస్యల చెప్పారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయమై వీలైనంత తొందరగానే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో రజిని అభిమానులు ఆయన ఇంటికి చేరుకోగా, వారికి ఈసారి కూడా నిరాశ ఎదురైంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox