Breaking News

సహనం’ అన్న డీఎన్‌ఏ నశించింది:రాహుల్ గాంధీ

12 th Jun 2020, UTC
సహనం’ అన్న డీఎన్‌ఏ నశించింది:రాహుల్ గాంధీ

అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లోని దౌత్య ప్రొఫెసర్‌ నికోలస్ బర్న్స్ తో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంభాషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానూ రానూ భారత్‌లో, అమెరికాలో సహనం అనే డీఎన్‌ఏ నశించిపోయిందని ఆరోపించారు. భారత్ - అమెరికా సంబంధాలు ‘సహనం’ అన్న పునాదులపైనే నడస్తున్నాయని, కానీ... దురదృష్ట వశాత్తూ ఇరు దేశాల డీఎన్‌ఏల్లోనూ సహనం అన్న డీఎన్‌ఏ కనుమరుగైపోయిందని వ్యాఖ్యానించారు.

మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని అనుకున్నాం. కానీ అలా మాట్లాడే డీఎన్‌ఏ కనుమరుగైపోయింది. ఈ విషయాన్ని నేను చాలా బాధతో చెబుతున్నా. ఎంత సహనాన్ని కోరుకున్నానో అంత సహనంగా లేదు. అమెరికాలో, భారత్‌లో నేను ఎంతైతే సహనం ఉంటుందని భావించానో అంత లేదు  అని వ్యాఖ్యానించారు.

రెండు సహనంతో ఉన్న దేశాలు కాబట్టే మన బంధాలు కొనసాగుతున్నాయి. మాది వలసల దేశం అని మీరు పేర్కొన్నారు. మేము చాలా సహనశీలురం. మా డీఎన్‌ఏ సహనంతో ఉండాలి  అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ వాస్తవానికి రెండు దేశాలు అంటూ కామెంట్ చేసినప్పటికీ ప్రసుతం వున్న పాలకుల పట్ల అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు  భావిస్తున్నారు.

దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి రాహుల్ గాంధీ పలువురు ఆర్దిక నిపుణులు, మేధావులతో చర్చలు జరిపి వాటి వివరాలను వెల్లడించారు. కరోనా మహమ్మారితో అస్తవ్యస్తమయిన దేశ ఆర్దిక వ్యవస్ద తిరిగి గాడిలో పడాలన్నా, వలస కార్మికులకు, పేదలకు తగిన సాయాన్ని అందించాలని అయితే నేరుగా నగదు రూపంలో వుండాలని రాహుల్ సూచించిన విషయ తెలిసిందే.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox