Breaking News

చైనా బలగాలు దేశంలో అడుగు పెట్టాయా? లేదా?:రాహుల్ గాంధీ

09 th Jun 2020, UTC
చైనా బలగాలు దేశంలో అడుగు పెట్టాయా? లేదా?:రాహుల్ గాంధీ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. తమ పార్టీపై విమర్శలు చేసే ముందు.. అసలు చైనా బలగాలు దేశంలో అడుగుపెట్టాయో లేదో చెప్పాలంటూ నిలదీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే... రాహుల్ మరోసారి ఇదే ప్రశ్న అడిగారు.

చేతి గుర్తుపై రక్షణ మంత్రి విమర్శలు చేసేముందు ఒకదానికి సమాధానం చెప్పాలి. లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందా లేదా..?అని ట్విటర్లో రాహుల్ ప్రశ్నించారు.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తర్వాత సరిహద్దులను కాపాడుకోగల సత్తా ఇప్పుడు భారత్‌కు మాత్రమే ఉందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో... బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

సరిహద్దుల్లో మన పరిస్థితి అందరికీ తెలుసులే.. అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. చేతికి నొప్పి పుడితే మందు రాస్తాం. కానీ ఆ నొప్పికి చెయ్యే కారణమైతే ఏంచేయాలి? అంటూ రాహుల్ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తిప్పికొట్టారు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox