Breaking News

PM Narendra Modi : ఎర్రకోటపై నేను ఏం మాట్లాడాలో సలహా ఇవ్వండి.. పీఎం నరేంద్రమోదీ

31 st Jul 2021, UTC

National : ఆగష్టు 15న జరగనున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకులకు ఎర్రకోట వద్ద కేంద్రం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలో ప్రజల ఆలోచనలకు స్థానం లభించనుంది.

ఈ మేరకు శుక్రవారం ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయని పేర్కొంది. ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం కోసం మీ ఆలోచనలు ఏమిటి? @mygovindia ద్వారా మీ ఆలోచనలు పంచుకోండి అని పీఎంవో దేశ ప్రజలను కోరింది.

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తారు. నాలుగేళ్ళ నుంచి నేరుగా ప్రజల ఆలోచనలు, సలహాలను కోరుతున్న విషయాన్ని పీఎంవో  గుర్తు చేసింది. ఈ ఏడాది కూడా ప్రజలు నవ భారతం కోసం తమ సలహాలను అందజేయాలని కోరింది. సలహాలకు అక్షర రూపం ఇచ్చి, తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు పంపించిన అంశాల్లో కొన్నింటిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తారని పీఎంవో పేర్కొంది.

ఈ ట్వీట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కొందరు పెగాసస్, రఫేల్, పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాలు వంటివాటి గురించి మాట్లాడాలని కోరగా, మరికొందరు మాత్రం కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox