Breaking News

రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు మాతృ వియోగం.!

06 th Jun 2020, UTC
రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు మాతృ వియోగం.!

కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ కు మాతృ వియోగం కలిగింది. ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆమె ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తన మాతృమూర్తి చంద్రకాంత గోయల్ వృద్ధాప్య కారణం తో మరణించిందని.. ఆమె జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిందని.. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం చంద్రకాంత గోయల్ ముంబయిలో కార్పొరేటర్ గా ప్రస్థానం ఆరంభించారు. ఆపై ముంబయిలోని మాతుంగ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, చంద్రకాంత గోయల్ భర్త దివంగత వేద్ ప్రకాశ్ గోయల్ సుదీర్ఘకాలం బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. ఆయన వాజ్ పేయి సర్కారులో షిప్పింగ్ మంత్రిగా కూడా పని చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox