Breaking News

కేంద్రానికి శివసేన ప్రశ్నలు..

20 th Sep 2020, UTC
కేంద్రానికి శివసేన ప్రశ్నలు..

న్యూఢిల్లీ :ఆదివారం కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ అంటున్నారని, కేవలం పుకార్ల ఆధారంగానే అకాలీదళ్‌కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? చెప్పాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఆందోళనపై పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లులతో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండదని కేంద్రం ప్రకటించిందని, ఒకవేళ అదే గనక నిజమైతే చాలా సంతోషించాల్సిన పరిణామమని ఆయన అన్నారు. ఈ వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోరన్న ధీమాను కేంద్రం ఇవ్వగలదా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

ఈ బిల్లులు చట్టం రూపం దాల్చితే రైతుల ఆదాయం రెండింతలు అవుతుందా? ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉంటాడా? ఆ మేరకు మోదీ ప్రభుత్వం హామీ ఇస్తుందా..? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.పంటలకు కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగిస్తామని ప్రధాని మోదీ చెబుతున్నా, అది  వట్టిదేనని  సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లులపై హడావిడిగా చట్టాలు చేయడం కరెక్టు కాదని, ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లులపై సమగ్ర చర్చ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox