Breaking News

యోగి ఆదిత్యనాథ్‌కు పాక్ ఎడిటర్ ప్రశంసలు..!

08 th Jun 2020, UTC
యోగి ఆదిత్యనాథ్‌కు పాక్ ఎడిటర్ ప్రశంసలు..!

ఉత్తర ప్రదేశ్‌లో నోవెల్ కరోనా వైరస్‌ నివారణ కోసం కృషిచేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పాక్ నుంచి  ప్రశంసలు వచ్చాయి.  ఇదేమిటి యోగి కి పాక్ ప్రశంసలు ఎందుకు ఇచ్చింది అనుకోవడం సహజం. ప్రశంసలు కురింపించింది పాక్ ప్రభుత్వం కాదు. పాకిస్తాన్‌కి చెందిన సీనియర్ జర్నలిస్టు, డాన్ దినపత్రిక ఎడిటర్ ఫహద్ హుస్సేన్ . ఆయన ట్విటర్లో యోగిని అభినందించారు.  ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. పాకిస్తాన్‌లో మాత్రం అలాంటిదేమీ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో పాకిస్తాన్, ఉత్తర ప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు, దాని ప్రభావాన్ని వివరిస్తూ ఆయన ఓ గ్రాఫ్ సైతం విడుదల చేశారు.


ఈ గ్రాఫ్ ప్రకారం.. పాకిస్తాన్‌లో 20.8 కోట్లమంది జనాభా ఉండగా.. యూపీలో 22.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే దాయాది దేశంలో యూపీలో కంటే ఏడు రెట్లు అధికంగా మరణాలు నమోదయ్యాయి. కాగా పాకిస్తాన్‌ను మహారాష్ట్రతో కూడా పోల్చుతూ హుస్సేన్ కొన్ని గణాంకాలు విడుదల చేశారు.

భారత దేశంలోని యూపీలో పాకిస్తాన్ కంటే తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అయితే యువత, ఆర్ధిక వనరులు ఎక్కువగా ఉన్న రాష్టమైన మహారాష్ట్రలో మాత్రం అత్యధిక కరోనా మరణాలు నమోదవుతున్నాయి అని ఆయన గుర్తుచేశారు. కొవిడ్-19 మరణాలు తగ్గించడానికి యూపీ ప్రభుత్వం ఏమి చేసింది, మహారాష్ట్ర ఏమి చేయలేదనేది పాకిస్తాన్ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox