Breaking News

మే 2న నా చివరి ట్వీట్ చూడండి : ప్రశాంత్ కిశోర్

27 th Feb 2021, UTC

పశ్చిమ బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయాల్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను తప్పించి, అక్కడ కూడా అధికారం పొందాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు, మరోసారి తన అధికారాన్ని కొనసాగించడం కోసం ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదంతా ఒకెత్తయితే, బెంగాల్ లో మమతా విజయం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ తృణమూల్ పార్టీ గెలుపు కోసం పని చేస్తోంది. 'బెంగాల్ తన సొంత కూతురునే కోరుకుంటోంది' అనే నినాదంతో వీరు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరో వైపు ప్రశాంత్ కిషోర్ కూడా మమతా పార్టీ గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యం కోసం జరుగుతూన్నయుద్ధాల్లో ఒకటి బెంగాల్ లో జరుగుతోందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. మే 2న తన చివరి ట్వీట్ చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల ఆయన తన ఖాతాలో పేర్కొన్నారు. మే 2న అసెంబ్లీ ఎన్నికల చివరి ఫలితాలు విడుదల కానున్నాయి. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

One of the key battles FOR DEMOCRACY in India will be fought in West Bengal, and the people of Bengal are ready with their MESSAGE and determined to show the RIGHT CARD - #BanglaNijerMeyekeiChay

(Bengal Only Wants its Own Daughter)

PS: On 2nd May, hold me to my last tweet. pic.twitter.com/vruk6jVP0X

— Prashant Kishor (@PrashantKishor) February 27, 2021

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox