Breaking News

ఒడిశా సీఎం బర్త్ డే స్పెషల్.. ల72 కేజీల చాక్లెట్ శిల్పం తయారు చేసిన చెఫ్

17 th Oct 2021, UTC

 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఖోర్ధాలోని బెగునియాకు చెందిన చెఫ్ రాకేశ్ కుమార్ సాహు 72 కిలోల అందమైన చాక్లెట్ శిల్పాన్ని రూపొందించారు.32 ఏళ్ల సాహుకి టంకా పానీ రోడ్‌లో బేకింగ్ మరియు పేస్ట్రీ ఆర్ట్ అకాడమీ ఉంది.

అతను 15 రోజుల్లో శిల్పం పూర్తి చేశాడు. సాహు ఒక క్రీడాభిమాని. గత  కొన్నేళ్లుగా భారత హాకీకి పట్నాయక్  సహకిరించినందుకు  ఈ శిల్పాన్ని సృష్టించినట్లు అతను ఒక ఇంటర్వూలో వివరించాడు. సీఎం పట్నాయక్ సహకారంతో టోక్యో ఒలింపిక్ గేమ్స్ 2020 లో పురుషుల మరియు మహిళల  హాకీ జట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాయి.కాంస్య పతకం సాధించినందుకు నేను కూడ మిగిలిన వారి మాదిరిగానే సంబరాలు చేసుకున్నాను, నేషనల్ హాకీ టీమ్స్‌ని అత్యున్నత స్దాయిలో నిలబెట్టిన మా ముఖ్యమంత్రి కోసం నేను ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నేను భావించానని సాహు అన్నారు.

శిల్పం తయారు చేసే సిబ్బంది ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల వల్ల నిద్రలేని రాత్రులు మరియు వారి వర్క్‌షాప్‌లో తేమ స్థాయిలలో మార్పులతో సహా రెండు వారాలకు పైగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు సాహు తెలిపారు. పూర్తయిన శిల్పం వారు ఊహించినట్లుగానే మారడంతో వారి ప్రయత్నాలు ఫలించాయని  అన్నారు. శనివారం సీఎం జన్మదినం సందర్భంగా కళింగ హాకీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా మంత్రి తుషార్కంటి బెహరా ఆవిష్కరించారు. దీన్ని ప్రదర్శించన తరువాత చుట్టుపక్కల జిల్లాల్లోని పిల్లలకు శిల్పం సృష్టించడానికి ఉపయోగించిన చాక్లెట్‌ను పంపిణీ చేయాలని క్రీడా శాఖ నిర్ణయించింది

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox