Breaking News

శశికళను ఇప్పుడే విడుదల చెయ్యం..!

23 rd Sep 2020, UTC
శశికళను ఇప్పుడే విడుదల చెయ్యం..!

చెన్నై :శశికళ, ఈమెకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపణ కావడంతో జైలు శిక్ష విధించారు. అప్పటి నుంచి ఆమె పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే. అయితే తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలోఈమె శిక్షను తగ్గించి ముందస్తుగా విడుదల చేస్తారన్న వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఆమెను ముందుగా విడుదల చేసేది లేదని కర్ణాటక జైళ్లశాఖ స్పష్టం చేసింది.

ఆమె శిక్ష కాలం వచ్చే ఏడాది జనవరి వరకు ఉందని, అప్పటివరకు ఆమె శిక్ష అనుభవించాలని స్పష్టం చేసారు. 2017 ఫిబ్రవరి నుంచి ఆమె శిక్షను అనుభవిస్తున్నారు. అయితే ఆమె సత్ప్రవర్తన కారణంగా అక్టోబర్ లో విడుదల అవుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఓ సమాచార హక్కు కార్యకర్త ఆమె విడుదలపై కర్ణాటక జైళ్ల శాఖకు లేఖ రాసారు. దీనితో, అలాంటిదేమి లేదని వారి నుంచి సమాధానం వచ్చింది.

సహ చట్టం కింద నరసింహమూర్తి అనే వ్యక్తి లేఖ రాయగా ఆమె 2021 జనవరి 27న విడుదల అవుతారని కర్ణాటక జైళ్ల శాఖ సమాధానం పంపింది. మరో వైపు ఆమెకు చెందాల్సిన సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ లో శశికళ విడుదల అవుతారని ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జైళ్లశాఖ ఈ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ లేఖలో అవినీతి నిరోధక చట్టం కింద శిక్షను అనుభవిస్తున్న వారికి సెలవులు ఉండవని తెలిపింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రమే సెలవులు ఉంటాయని తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox