Breaking News

ముంబై వాసులకు 'నిసర్గ' ముప్పు..పలు సూచనలు చేసిన ప్రభుత్వం...!

03 rd Jun 2020, UTC

'నిసర్గ' తుఫాను రాయగఢ్ వద్ద తీరాన్ని తాకింది. దీనితో.. గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పలు గ్రామాలను ఎన్డీఆర్‌ఏఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారత వాతావరణశాఖ ముంబై వాసులకు పలు జాగ్రత్తలు చెప్పింది.నిసర్గ కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే 1916కు డయల్ చేయాలని ,లేదంటే 4 నెంబర్‌కు డయల్ చేయాలి అని స్పష్టం చేసింది.
ఇంట్లోనే ఉండండి. మొబైల్ ఫోన్లను ఫుల్‌గా చార్జింగ్ చేసుకోండి. పవర్ బ్యాంకులను కూడా ఫుల్ చార్జింగ్ చేసుకోమని చెప్పింది.
ముఖ్యమైన కాగితాలను.. ఆభరణాలను ప్లాస్టిక్ కవర్లు లేదా డబ్బాల్లో జాగ్రత్త చేసుకోవాలని చెప్పింది.
అవసరం లేని వాటికీ విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కోరింది.
కిటికీ తలుపులకు దగ్గరగా ఉండవద్దని... అవసరం అయితే తప్ప కిటికీ తలుపులు తెరవద్దని సూచించింది. గాలి పీడనం బయటికి వెళ్లడానికి, సరిగ్గా ఉండడానికి కొన్ని కిటికీలను మాత్రం తెరిచి ఉంచుకోవచ్చని తెలిపింది.
గ్యాస్ లీక్ వాసన వస్తుంటే... వెంటనే కిటికీలను తెరచి... ఇంటి నుంచి బయటికి వచ్చేయండి. వీలైతే.. గ్యాస్ వాల్వ్‌ను ఆపేసి... వెంటనే గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. 
రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద 'నిసర్గ' తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుపాను తీరం దాటడానికి మరో మూడు గంట ల సమయం ఉంది.
పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
        ఇప్పటికే... తుపాను నేపధ్యం లో పలు రైళ్లను రద్దు చేసారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించేసారు.. ప్రస్తుతం ముంబై లో 144 సెక్షన్ అమలు లో ఉంది. ఓ రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు పుణెలోని లోతట్టు ప్రాంతాలు నీటిమయం అయ్యాయి.       

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox