Breaking News

కేరళను తాకిన నైరుతి పవనాలు..!

02 nd Jun 2020, UTC
కేరళను తాకిన నైరుతి పవనాలు..!

నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడంతో  సోమవారం ఆ రాష్ట్రంలో చల్లని ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం సోమవారం ధ్రువీకరించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులను ఈ రుతు పవనాలు పూర్తిగా కమ్ముకున్నాయి.
మాల్దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు,  తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమెరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కాగా, నైరుతి రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలవల్లే దేశంలో 50 శాతంపైగా పంటలు సాగవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అత్యధిక ప్రాంతాల్లో పంటల సాగుకు నైరుతి రుతుపవనాలే కీలకం.
ఈ సీజన్‌ (జూన్‌–సెప్టెంబర్‌)లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్లు ఐఎండీ సోమవారం ఢిల్లీలోనూ, అమరావతిలోనూ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా మీడియా సమావేశంలో వివరించారు. ప్రాంతాల వారీగా, నెలల వారీగా కూడా దీర్ఘకాలిక వర్షపాత అంచనాలను ఐఎండీ అధికారులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా జూలైలో 103 శాతం, ఆగస్టులో 97 శాతం వర్షపాతం నమోదవుతుంది. ఈ అంచనాలో తొమ్మిది శాతం అటూ ఇటుగా తేడా ఉండవచ్చని తెలిపారు. అలాగే.. దక్షిణాది రాష్ట్రాల్లో 102 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox