Breaking News

ఇక్బాల్ మిర్చి దుబాయ్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

22 nd Sep 2020, UTC

న్యూఢిల్లీ :అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఇక్బాల్ మిర్చికి సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్థు చేసింది. దుబాయ్ లో వున్న ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.203 కోట్లు ఉంటుందని అంచనా. ఈడీ తాజాగా జప్తు చేసినవాటిలో ఓ విలాసవంతమైన హోటల్, 14 నివాస, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.

దుబాయ్‌లో ఆస్తులు కొనేందుకు ఇక్బాల్ మిర్చికి వధవాన్స్ గ్రూప్‌కు చెందిన ఓ కంపెనీ సహాయపడిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక్బాల్ మిర్చి దుబాయ్‌లో మాత్రమే కాకుండా న్యూజిలాండ్, యూఏఈ, ఇంగ్లండ్‌లలో కూడా రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ముంబైలోని సీజే హౌస్, సాహిల్ బంగళా, రబియా మాన్షన్, మరియం లాడ్జి, సీవ్యూ ఆస్తుల కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్లు కేసు నమోదైంది. మిర్చి, ఆయన బంధువులపై క్రిమినల్ కేసులు, మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక్బాల్  మిర్చి భార్య, ఇద్దరు పిల్లలపై ప్రస్తుతం నిఘా ఉంది. వీరిపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయ్యాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లకు సంబంధించిన నేరాల్లో దావూద్ ఇబ్రహీంకు మిర్చి కుడి భుజంగా వ్యవహరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతను 2013లో బ్రిటన్‌లో మరణించాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox