Breaking News

మహిళా దినోత్సవం నాడు గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

08 th Mar 2021, UTC

జార్ఖండ్‌కు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు గుర్రంపై వచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ గుర్రాన్ని తనకు మాజీ కల్నల్ బహుమతిగా ఇచ్చారని, అనంతరం అదే గుర్రంపై అసెంబ్లీకి వచ్చానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అన్నారు. 31 ఏళ్ల అంబా ప్రసాద్, బర్కోగాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీలో ఆమె పిన్న వయస్కురాలు.

సోమవారం జార్ఖండ్ రాజధానిలో రాంచీలో కినిపించిన ఈ దృశ్యం స్థానికులను అమితంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇతరులు ఆమెను అసెంబ్లీ వరకు అనుసరిస్తూ వచ్చారు. అనంతరం అసెంబ్లీ బయట కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఈ సన్నివేశాన్ని తిలకించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ కల్నల్ రవి రాథోడ్ నాకు ఈ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనిపై అసెంబ్లీకి రావాలని అనిపించింది. వచ్చేశాను అని అంబా ప్రసాద్ తెలిపారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox