Breaking News

అప్పుడు ఇందిర... ఇప్ఫుడు మోదీ:మనీశ్ తివారీ

04 th Jul 2020, UTC

ప్రధాని మోదీ లడాఖ్ పర్యటనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో 1971 లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లేహ్‌లో పర్యటించిన నాటి ఫోటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

1971 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ లేహ్‌లో పర్యటించిన తర్వాత పాకిస్తాన్‌ను రెండుగా విభజించారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఏం చేస్తారో చూడాలి మరి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

1971 లో కూడా ఇందిరా గాంధీ లేహ్‌లో పర్యటించి... జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. దీని తర్వాతే భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగింది. యుద్దంలో పాక్ ఓడిపోయి  తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరంచింది. ప్రధాని మోదీ శుక్రవారం అకస్మాత్తుగా లద్దాఖ్‌లో పర్యటించారు.

గాల్వాన్ లోయలో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణాత్మక వైఖరి చోటు చేసుకున్న తరుణంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం చోటు చేసుకుంది. మోదీతో పాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే కూడా ఉన్నారు.   దీనితో ఇపుడు మోదీ కూడ చైనా తో యుద్దం దిశగా వెడతారా అన్న అర్దం వచ్చేలా తివారీ పై విధంగా ట్వీట్ చేసారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox