Breaking News

కోల్ కతా నేతలకు దీదీ వార్నింగ్

07 th Jun 2020, UTC
కోల్ కతా నేతలకు దీదీ వార్నింగ్

కోల్‌కతాలో ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలుమమతా బెనర్జీ శుక్రవారం ముఖ్య కార్యకర్తలు, నాయకులతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, యూనిట్ అధ్యక్షులు... ఇలా అత్యంత కీలక నేతలతో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ భేటీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరు ఏరకంగా ఉందో అడిగి తెలుసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టాల్సిందేనని ఆమె దృఢ నిర్ణయానికి వచ్చినట్లు నాయకులు తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయవంతమైన తీరు... ప్రతి ఇంటింటికీ చేరాలని పార్టీ కార్యకర్తలకు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. కోవిడ్ సహాయక చర్యల్ని, ఆంఫన్ తుపాను సహాయక చర్యలకు రాజకీయ రంగు పులమడంపై నేతలను ఆమె . హెచ్చరించారు. సహాయక చర్యల్లో పార్టీ కార్యకర్తలు జోక్యం చేసుకోకూడదు. వాటిని ప్రభుత్వానికి వదిలేయండి. బాధితులందరికీ, ఇతర పార్టీల మద్దతుదార్లకూ సహాయం అందేలా చూడాలి అని తమను ఆదేశించారని ఓ ఎంపీ పేర్కొన్నారు.

పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించకూడదు. ముఖ్యంగా కోల్‌కతా నేతలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నా. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు. తలుపులు తెరిచే ఉన్నాయి అని మమతా తీవ్రంగా హెచ్చరించారు.

ఇప్పటికే ప్రతిపక్ష బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. తానూ సోషల్ మీడియా మాధ్యమంగా ఇకపై ప్రచారాన్ని ముమ్మరం చేస్తా, ప్రజలకు మరింత చేరువవుతాఅని ఈ సమావేశంలో మమతా పేర్కొన్నారు. ప్రభుత్వ విజయాలు, పథకాలు ఇంటింటికీ చేరేలా చూడాలని, బీజేపీ సోషల్ మీడియాపై తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేసారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox