Breaking News

పెళ్లి చదివింపులు కూడా ఇక ఆన్ లైన్.. ఈ జంట ఐడియా అదిరింది..!

20 th Jan 2021, UTC

తమిళనాడు :కరోనా కారణంగా అంగరంగ వైభవంగా జరుపుకుందామనుకున్న పెళ్లిళ్లు కూడా సాధారణంగా పరిమిత సంఖ్యలో అతిథులతో జరుపుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే నానా హంగామా ఉండేది. అలాగే, చుట్టాలను, సన్నిహితులను, పరిచయస్తులను మొత్తం అందరిని పిలిచేసి హడావిడి చేసేవారు. అలాగే, ఇంత ఎక్కువ మంది పెళ్లికి హాజరు అయినప్పుడు ఆ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఇచ్చే చదివింపులు కూడా కొంచం ఎక్కువగానే ఉండేవి. 

అయితే, కరోనా వచ్చాక పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎక్కువ మంది ని పిలవడానికి అనుమతులు ఉండవు. ఒకవేళ పిలిచినా ఆ వివాహానికి వచ్చేవారు ఎవరు లేరు. దీనితో, పెళ్లి కి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. పిలిచినా కూడా, కరోనా భయంతో చాలా మందికి పెళ్లిళ్లకు హాజరు కావడం లేదు. దీనితో, నూతన వధూవరులకు వచ్చే చదివింపులు కూడా తక్కువగానే వస్తాయి. చాలా మంది ఈ విషయాన్నీ అంతగా పట్టించుకోలేదు. కానీ తమిళనాడులో ఓ జంట మాత్రం దీనిని అలా వదిలేయలేదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు, ఈ సమస్యకి ఓ పరిష్కారాన్ని కూడా ఆలోచించేసింది.

అదే అండి, డిజిటల్ పేమెంట్. డైరెక్ట్ గా ఫోన్ చేసి అడిగితె బాగోదు కదా. అందుకే శుభలేఖలోనే క్యూ ఆర్ కోడ్ ను ముద్రించేసింది. అందరికి ఈ శుభలేఖలు పనిచేసింది. పెళ్లి రమ్మని ఆహ్వానించింది. రాలేకపోయినా, క్యూ ఆర్ కోడ్ పై స్కాన్ చేసి, ఫోన్ పే/ గూగుల్ పే అకౌంట్ ల ద్వారా చదివింపులు పంపాలని కోరింది. దీనితో ఈ శుభలేఖ ఇప్పుడు బాగా పాపులర్ అయిపొయింది. 

ఈ శుభలేఖ గురించి వధువు తల్లి మాట్లాడుతూ ఇప్పటివరకు ముప్పై మంది చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. ఈ శుభలేఖ వైరల్ అవుతుండడంతో చాలా మంది ఫోన్ లు చేసి ఐడియా బాగుంది అంటూ మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ఎంతైనా క్రేజీ ఐడియా కదా. ఇక పై రానున్న  రోజుల్లో కూడా ఈ డిజిటల్ చెల్లింపులు మరింత ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆశీర్వాదం కింద ఇచ్చే చదివింపులు కూడా డిజిటలైజ్ అయిపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. కరోనా కొత్త కొత్త మార్గాల్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో మరి.  మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox