Breaking News

ఈ రెండు మేకల ఖరీదు.. రూ.4.5 లక్షలు

21 st Jul 2021, UTC
ఈ రెండు మేకల ఖరీదు.. రూ.4.5 లక్షలు

ఉత్తరప్రదేశ్ :బక్రీద్ వేడుకల కోసం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక వ్యక్తి రెండు మేకలను రూ .4.5 లక్షలకు కొన్నాడు. లక్నోలోని గోమతి నది సమీపంలో ఉన్న మార్కెట్లో ఈ మేకలను మంగళవారం ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ మేకల బరువు 170 కిలోలు, 150 కిలోలుగా వుంది. వీటి వయసు రెండేళ్లు. వీటి ఆహారానికి అయే ఖర్చు రోజుకురూ 600 రూపాయలు వరకూ వుంటుంది. రోజూ మేకలకు జీడిపప్పు, పిస్తా, బాదం, స్వీట్లు  తినిపిస్తారు. వీటికి రోజూ షాంపూతో స్నానం చేస్తారు. ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేస్తారు.

బక్రీద్ ఈ సంవత్సరం రెండవ ఇస్లామిక్ పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 12వ నెల 10వ రోజున దీనిని జరుపుకుంటారు. ఇది మక్కాకు హజ్ తీర్థయాత్ర ముగింపును సూచిస్తుంది. ఈ పండుగ ముస్లింల రెండవ అతి ముఖ్యమైన పండుగ. ఈ రోజు  మేక, గొర్రెలు, ఒంటె, గేదెల్లో ఒక వ్యక్తి ఏది ఇవ్వగలితే దాన్ని బలి ఇవ్వడం ఆనవాయితీ.

ఖురాన్ ప్రకారం, ఇబ్రహీం తన కుమారుడు ఇష్మాయేలును దేవుని ఆజ్ఞను అనుసరించి బలి ఇవ్వడానికి సిద్దమవుతాడు. అపుడుస్వర్గం నుండి ఒక స్వరం అతనిని ఆపివేసి, 'గొప్ప త్యాగం' గా వేరే బలి ఇవ్వడానికి అనుమతించింది. దేవుడు అతనికి బలి ఇవ్వడానికి ఒక గొర్రెపిల్లని అందించాడు. ఈ సందర్భానికి  గుర్తుగా, బక్రీద్ నాడు జంతువులను బలి ఇస్తారు. మాంసంలో మూడింట ఒకవంతు కుటుంబానికి, మిగిలినది పేదలకు పంపిణీ చేయబడుతుంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox