Breaking News

పార్లమంట్ ప్రతిష్టంబనతో రూ.133 కోట్లు నష్టం

01 st Aug 2021, UTC

NEW DELHI :పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయాల కారణంగా రూ.133  కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి,పెగాసస్ స్నూపింగ్ కుంభకోణంపై ప్రభుత్వం మరియు విపక్షాల పట్టుదలకు పోవడంతో పార్లమెంట్ ఉభయసభలు తరచుగా వాయిదా పడ్డాయి.

జూలై 19న పార్లమెంటు సమావేశమైనప్పటి నుండి ప్రతిపక్ష నాయకులు మరియు న్యాయమూర్తుల ఫోన్‌లను హ్యాక్ చేయడానికి ఇజ్రాయెల్ స్పైవేర్ ఉపయోగించారనే వార్తలపై విపక్షాలు భగ్గుమన్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఒక స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసాయి. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్లను తోసిపుచ్చింది. ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో చదివిన ప్రకటన సరిపోతుందని పేర్కొంది. 

ఇప్పటివరకు పార్లమెంటు 107 గంటల్లో18 గంటలు మాత్రమే పని చేసింది. తద్వారా 89 గంటల పని సమయం వృధా అయ్యింది. దీనితో పన్ను చెల్లింపుదారులకు నష్టం రూ.133 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు విపక్షాలు అడ్డుపడ్డాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగనే ప్రతిష్టంబన కొనసాగేలా చేసిందని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox