Breaking News

ముంబై లో లోకల్ ట్రైన్స్..వారికోసమే...!

15 th Jun 2020, UTC
ముంబై లో లోకల్ ట్రైన్స్..వారికోసమే...!
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో రవాణా వ్యవస్థ పూర్తి గా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే... ప్రస్తుతం అన్ లాక్ దశలో ఇపుడిపుడే కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతూ... కొన్ని చోట్ల బస్సులకు అనుమతులు ఇస్తూ.. రవాణా వ్యవస్థ ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా.. ముంబై లో కూడా లోకల్ ట్రైన్స్ కి అనుమతులు ఇవ్వనున్నారని సమాచారం.
 
              కేవలం అత్యవసర సర్వీసులు అందించే వారి కోసం ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు ప్రతి 15 నిమిషాల విరామంతో రైళ్లను నడపనున్నట్లు వెస్ట్రన్‌ రైల్వే ట్వీట్‌ చేసింది. అయితే.. ఈ రైళ్లలో సాధారణ ప్రయాణీకులకు మాత్రం అనుమతులు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తించబడిన అత్యవసర సేవలు అందించే వారికి మాత్రం అనుమతులు ఇవ్వబడతాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.25 లక్షల మందిని అత్యవసరమైన సిబ్బందిగా గుర్తించింది.
 
              అయితే.. ఇలా గుర్తింపు పొందిన వారు కూడా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించడానికి గుర్తింపు కార్డు తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. స్టేషన్‌లోకి వెళ్లే ముందు, టికెట్ కొనేటప్పుడు ఈ గుర్తింపు కార్డుని చూపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే లోకల్‌ రైళ్లను నడుపుతున్నారు.  అయితే... భౌతిక దూరం పాటిస్తూ ఈ ట్రైన్స్ లో ప్రయాణించడానికి కేవలం 1200 మంది కి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. ఒక ట్రైన్ లో 700 మందికి మాత్రమే ఒక ట్రైన్ లో ప్రయాణించడానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox