Breaking News

కచ్చితంగా ఎవరో అబద్ధం చెప్తున్నారు:రాహుల్ గాంధీ

04 th Jul 2020, UTC

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలవర్షం కురిపించారు. మన భూమిని ఎవరూ తీసుకోలేదని ప్రధాని మోదీ చెప్తున్నారని, లడఖ్ ప్రజలు చెప్తున్నదానికి ఇది భిన్నంగా ఉందని అన్నారు.

రాహుల్ గాంధీ శుక్రవారం , మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లడఖ్ ప్రజలు చెప్తున్నారు. మన భూమిని ఎవరూ తీసుకోలేదని మోదీ చెప్తున్నారు. కచ్చితంగా ఎవరో అబద్ధం చెప్తున్నారు అని ట్వీట్ చేసారు.
 
ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోలో కొందరు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్తున్నట్లు కనిపించింది.
 
ఇదిలావుండగా, ప్రధాని మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించారు. భారత సైన్యానికి ఆత్మస్థయిర్యం పెరిగేలా మాట్లాడారు. నేటి కాలంలో రాజ్యాన్ని విస్తరించుకునే అవకాశాలు లేవని, ఆ రోజులు పోయాయని చైనాకు గట్టిగా చెప్పారు. భారత దేశానికి ఉన్న శక్తిసామర్థ్యాలు ప్రపంచ మానవ కల్యాణానికే ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox