Breaking News

నిర్మలమ్మ స్దానంలో కొత్త మంత్రి?

05 th Jun 2020, UTC
నిర్మలమ్మ స్దానంలో కొత్త మంత్రి?

కేంద్రమంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు వుంటాయన్న ఢిల్లీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రిని మారుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్రమోదీ ఈ దిశగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణాదికి చెందిన నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. త్వరలోనే ఆర్థికమంత్రి పదవికి మరొకరిని ఎంపిక చేసే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పనితీరు సరిగ్గాలేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా ప్రధాని యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రధాని తన సన్నిహిత సహచరులతో కలిసి కేంద్ర మంత్రుల పనితీరుపై, మంత్రిత్వ శాఖలపై సమీక్ష జరిపినట్టు తెలిసింది. మంత్రిత్వ శాఖలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి, వాటి పురోగతిపై చర్చించారని సమాచారం. దీంతో మంత్రివర్గంలో చేరికలు, తొలగింపులతోపాటు మంత్రిత్వ శాఖల మార్పులుకూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మార్పు తప్పేలా లేదంటున్నారు. ఆమె  స్థానంలో బ్రిక్స్‌ కూటమి బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేస్తున్న కేవీ కామత్‌కు ఆర్థిక శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది.

ఆర్థిక శాఖతో పాటు.. మరికొన్ని శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నట్లు చెప్పుకుంటున్నారు. ఉన్నతస్థాయి వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రియా కూటమి బ్యాంక్‌ చైర్మన్‌గా ఉన్న కేవీ కామత్‌ కేంద్రమంత్రివర్గంలో చేరతారని, ఆయనకు ఆర్థిక శాఖ అప్పగించడం ఖాయమైందని తెలుస్తోంది. ఆయనతో పాటు.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్‌ గుప్తాకు కూడా మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారైందని సమాచారం. స్వపన్‌దాస్‌ గుప్తాకు మానవ వనరుల అభివృద్ధి శాఖలో సహాయమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితో పాటు.. కేంద్రమంత్రివర్గంలో కొత్తగా తీసుకునే వారిలో మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox