Breaking News

వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే కుమార్తె వివాహం..!

04 th Jun 2020, UTC

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ , కేఫ్ కాఫీ డే సిద్దార్ద కుటుంబాలు   మధ్య మంచి స్నేహ సంబంధాలు వున్నాయి. ఇపుడు వివాహం ద్వారా వాటిని మరింత బలోపేతం చేసుకోవాలని  ఇరు వైపులా పెద్దలు భావిస్తున్నారు.

 డీకే శివకుమార్ కుమార్తెను, వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్దేకు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఇందుకు సంబంధించి మాట్లాడుకున్నట్లు సమాచారం. డీకే శివకుమార్ పెద్ద కుమార్తె ఐశ్వర్య. వీజీ సిద్ధార్థ ఇద్దరు కుమారుల్లో అమర్త్య హెగ్దే ఒకరు.

ఐశ్వర్య, అమర్త్య హెగ్దే నిశ్చితార్థం ఆగస్ట్ మొదటి వారంలో జరగనున్నట్లు సమాచారం. అయితే.. పెళ్లి మాత్రం ఈ సంవత్సరం చివరిలో జరపాలని ఇరు కుటుంబాలు భావించినట్లు తెలిసింది.వీజీ సిద్ధార్థ మరణించిన కొన్నాళ్ల తర్వాతే ఈ పెళ్లి ప్రతిపాదన గురించి అమర్త్యతో మాట్లాడారని, అయితే.. కొంత సమయం కావాలని ఆ సందర్భంలో అమర్త్య స్పష్టం చేసినట్లు తెలిసింది. అమర్త్య, ఐశ్వర్య గత వారం ఒకరినొకరు కలుసుకున్నారని, ఇద్దరూ పెళ్లికి అంగీకారం తెలపడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించినట్లు సమాచారం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్  అయిన ఐశ్వర్య(22) , తండ్రి శివకుమార్ స్థాపించిన గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ బాధ్యతలను ఆమే చూసుకుంటోంది. అమర్త్య తల్లి మాళవికతో కలిసి తండ్రి మరణానంతరం వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox