Breaking News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు..!

09 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో  లాక్ డౌన్‌ అమలు చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో  ఎవరికైనా పాజిటివ్ అని  వస్తే ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

కొత్త మార్గదర్శకాలు  ఈ విధంగా వున్నాయి.

 దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విధులకు రాకూడదు.

సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు రావాలి.

 కట్టడి ప్రాంతాల ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం.

ఇంటర్‌కామ్‌ ఫోన్లలోనే ఉద్యోగులు మాట్లాడుకోవాలి.

 కంప్యూటర్‌ కీబోర్డులు ఎవరికి వారే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

 సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే నిర్వహించుకోవాలి.

 ఉద్యోగులు ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడుకోవద్దు అని కొత్త మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox