Breaking News

ప్రియాంక గాంధీ పేరు మార్చేసాం.. ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య

07 th Jun 2020, UTC
ప్రియాంక గాంధీ పేరు మార్చేసాం.. ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు  ‘ప్రియాంకా ట్విటర్‌ వాద్రా’గా నామకరణం చేశామని  ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యతెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీని సోషల్ మీడియా మాత్రమే ఒక గొప్ప జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోందని కానీ, ప్రజలు మాత్రం ఆమెను అలా గుర్తించడంలేదన్నారు.

2019 ఎన్నికల్లో తన సోదరుడు రాహుల్‌ గాంధీని కూడా గెలిపించుకోని ఆమె.. జాతీయ నాయకురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో అమేధి నుంచి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే

లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాంకా గాంధీ వరుసగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. వలస కార్మికుల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు.

యూపీకి చెందిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు సొంతంగా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ యూపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వరుసగా ఆమె ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox