Breaking News

డీకే ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చిన ఎడ్డీ సర్కార్..!

11 th Jun 2020, UTC

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా డీకే శివ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇప్పటికి మూడుసార్లు ప్రభుత్వం నిరాకరించింది.

దీనితో కేపీసీసీ అధ్యక్షునిగా డీకే శివ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం కక్ష సాధింపు రాజకీయాలేనని కాంగ్రెస్ ఆరోపించింది.

అయితే తాజాగా గురువారం ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో డీకే శివ కుమార్ ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి యడియూరప్పకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించాలో కాంగ్రెస్ నేతలతో త్వరలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నెల 5న శివ కుమార్ ముఖ్యమంత్రికి తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 14న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరవుతారని అంచనా.

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి, పంచాయతీలు, పురపాలక సంఘాలు, వార్డులు, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లో స్థానిక కార్యకర్తలు, ప్రజలు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్  ఇష్టపడే నాయకుల్లో ఒకరు. ఈడీ కేసులో అరెస్టయి శివకుమార్ తీహార్  జైల్లో వుండగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్వయంగా వెళ్లి పరామర్శించారు. అంతేకాదు.. శివకుమార్ అరెస్ట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోజుల తరబడి  నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాల్లో ఒక్కటైన ఒక్కలిగ కు చెందిన శివకుమార్ కు పార్టీలో వున్న బలం, అతని విధేయత  తెలిసే  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా హై కమాండ్  ఎంపిక చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox