Breaking News

Rahul Gandhi: జూలై పోయింది.. వ్యాక్సిన్ ఎక్కడ? రాహుల్ గాంధీ

01 st Aug 2021, UTC

New Delhi :దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల కొరత పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ల కొరత ఉందని పేర్కొంటూ వీడియోను షేర్ చేసి, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో 'వేర్ ఈజ్ వ్యాక్సిన్స్ ' అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించారు.

జూలై పోయింది. వ్యాక్సిన్ కొరత తీరలేదు. #ఎక్కడ వ్యాక్సిన్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేసారు. రాహుల్ తన జూలై 2 ట్వీట్‌ను కూడా హైలైట్ చేసారు. దీనిలో జూలై వచ్చింది, వ్యాక్సిన్ రాలేదు" అని చెప్పారు.

రాహుల్ గాంధీ జూలై 28న కోవిడ్ -19 టీకా తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి. అందువల్ల, అతను జూలై 29 మరియు జూలై 30న సభకు హాజరు కాలేదు. ఏప్రిల్ లో రాహుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అందుకే ప్రస్తుతం టీకా తీసుకోవడం లేటయింది.అంతకుముందు, జూన్ 17న, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు మోతాదులను అవసరమైన సమయ వ్యవధిలో తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox