Breaking News

సినీపరిశ్రమకు మద్దతివ్వాలన్న జయ బచ్చన్..రాజ్య సభలో కీలక వ్యాఖ్యలు..!

15 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో సినీ పరిశ్రమలోని డ్రగ్స్ వాడకం గురించి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ విషయమై ఎంపీ జయాబచ్చన్ ఈ రోజు రాజ్యసభలో మాట్లాడారు. డ్రగ్స్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం సినీ పరిశ్రమని నిందించడం సరి కాదన్నారు.

ఎవరో కొందరు చేసిన తప్పులకు మొత్తం సినీ పరిశ్రమ పై నిందలు వేయడం బాగోలేదన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వమే మద్దతుని తెలపాలని కోరారు. భారత్ లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులు ఉన్నారని గుర్తుచేశారు. లోక్‌స‌భ‌లో నిన్న సినీ పరిశ్రమ గురించి ఓ ఎంపీ ప్రతికూల వ్యాఖ్యలు చేయడం పట్ల జయాబచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేసారు.

సినీ పరిశ్రమలోనే పని చేసిన వ్యక్తి. అదే సినీ పరిశ్రమ గురించి చెడుగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇదంతా సినీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రగా ఆమె అభివర్ణించారు. రాజ్యసభలో జీరో అవర్ లో దీని గురించి మాట్లాడాల్సిందిగా ఆమె కోరారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox