Breaking News

సామూహిక యోగా ఈసారి ఉండదు..: కేంద్రం

05 th Jun 2020, UTC
సామూహిక యోగా ఈసారి ఉండదు..: కేంద్రం
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం జూన్ 21  వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భం గా ప్రధాని మోడీ నేతృత్వం లో సామూహికం గా యోగ దినోత్సవాన్ని జరిపించే సంగతి తెలిసిందే. అయితే.. కరోనా విస్తరిస్తున్న నేపధ్యం లో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఈ సారి సామూహికంగా నిర్వహించడం లేదని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా యోగా దినోత్సవాన్ని ఈసారి సామూహికంగా నిర్వహించడం లేదని పేర్కొంది. డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహిస్తామని, ఎవరికి వారు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో యోగా చేయాలని కేంద్రం తెలిపింది. 
 
        ఇంట్లో చేసినా సరే... సామాజిక దూరాన్ని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చేయాలని విజ్ఞప్తి చేసింది.
''ఇంట్లో యోగా... కుటుంబ సభ్యులతో యోగా' అన్న నినాదాన్ని కేంద్రం ప్రకటించింది. ఈసారి ప్రధాని మోడీ యోగా దినోత్సవాన్ని జమ్మూ కశ్మీర్‌లోని 'లేహ్' ప్రాంతంలో జరుపుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా కారణం గా ప్రధాని ప్రయాణం కూడా రద్దు అయింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox