Breaking News

జూలై నెలాఖరు కల్లా ఆరు రఫెల్ యుద్ధ విమానాలు..!

29 th Jun 2020, UTC
జూలై నెలాఖరు కల్లా ఆరు రఫెల్ యుద్ధ విమానాలు..!

ఫ్రాన్స్ నుంచి ఆరు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. తొలి విడతలో భాగంగా జులై 27నాటికి ఈ విమానాలు భారత్‌కు అందుతాయి. వీటిని నడపటానికి  ఫ్రాన్స్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లకు శిక్షణ ఇస్తున్నవిషయం తెలిసిందే . ఫ్రెంచ్ ఎయిర్‌బేస్‌లో ఇప్పటికే ఏడుగురు భారత పైలట్లకు శిక్షణ పూర్తైంది. మరో బ్యాచ్‌కు శిక్షణ తేదీలను నిర్ణయించాల్సి ఉంది.మొత్తం 36 రఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్-ఫ్రాన్స్ మధ్య 2016 సెప్టంబర్‌లో ఒప్పందం కుదిరింది.    

రఫెల్ యుద్ధ విమానాలు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో పనిచేసే ఈ ఫైటర్‌ జెట్స్‌లో ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో దాడిచేయగలిగే సామర్థ్యం ఉంది. ఆకాశంతో పాటు భూమిపైన లక్ష్యాలను కూడా రఫెల్ సులభంగా చేధిస్తుంది.

ఈ విమానాల నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. భారత అవసరాలకు అనుగుణంగా రఫెల్‌లో మార్పులు చేశారు.  ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా పేరున్న రఫెల్‌తో పాక్, చైనాలకు చెక్ పెట్టవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.  


వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అన్ని రకాల అత్యాధునిక యుద్ధ విమానాలను, శతఘ్నులను, క్షిపణి రక్షక వ్యవస్థలను  సమకూర్చుకుంటోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox