Breaking News

ఉల్లి ఎగుమతులపై నిషేధం...

16 th Sep 2020, UTC
ఉల్లి ఎగుమతులపై నిషేధం...

అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) ఉత్తర్వులు జారీ చేసింది. తాము చెప్పేంత వరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.అరు. బంగ్లాదేశ్, నేపాల్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు భారత్ నుంచే ఉల్లి ఎగుమతి అవుతోంది. భారీ వర్షాల కారణంగా  దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. మరోవైపు, రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ అవసరాలకు సరిపడా ఉల్లి నిల్వల కోసం ఎగుమతులపై నిషేధం విధించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox