Breaking News

చైనా మనకి శత్రు దేశమేనా..?

07 th Jul 2020, UTC
చైనా మనకి శత్రు  దేశమేనా..?
             గాల్వాన్ లోయ వద్ద చైనా చేసిన దాష్టీకం... భారత్ లో ఆగ్రహజ్వాలలు రగిలిస్తోంది... ప్రపంచమంతా.. చైనా కు వ్యతిరేకమై భారత్ కు అండగా ఉంటోంది. ఒక్క పాకిస్థాన్.. ఉత్తర కొరియా దేశాలు తప్ప ఏ ఇతర దేశం చైనా ను సమర్ధించడం లేదు.. అయితే.. సరిహద్దు వద్ద చైనా రగిలించిన చిచ్చు ఇంకా చల్లారలేదు.. స్నేహం గ ఉంటోంది అనుకున్న చైనా ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణాలేంటి..? చైనా తో ఎప్పటినుంచి శత్రుత్వం ఉంది..? గత 45 సంవత్సరాలు గా లేని గొడవలు ఇప్పుడెందుకొస్తున్నాయి..? 
 
           చైనా.. ప్రపంచం లో అతి పెద్ద జనాభా ఉన్న దేశం.. అభివృద్ధి చెందిన దేశం కూడా.. గత 45 సంవత్సరాల నుంచి చైనా తో మనకు మంచి సంబంధాలేవీ లేవు.. చైనా కు భారత్ అతి పెద్ద మార్కెట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రతి వస్తువు ను చైనా తయారు చేసి అమ్ముతుంది.. తక్కువ ధరలకు దొరుకుతుండడం తో.. భారత్ లోను  చైనా వస్తువులకు గిరాకీ ఉండేది.. అయితే.. క్రమం గా వ్యాపార పరం గా.. వాణిజ్య పరం గా చైనా ఎదుగుతూ వచ్చింది. భారత్ లో కూడా ఎదుగుదల ఉన్న.. చైనా కంటే తక్కువ గానే ఉంది. చైనా తరువాత.. అత్యంత ఎక్కువ జనాభా  ఉన్న దేశం భారత్ దేశమే..  నిన్న మొన్నటి వరకు పోటాపోటీ గా కొనసాగుతూ వస్తున్నా.. చైనా భారత్ సేనలు.. నేడు హిమాలయాల వద్ద సై  అంటే సై  అంటున్నాయి.. క‌శ్మీర్‌లోని ల‌ద్దాఖ్‌‌లో వివాదాస్ప‌ద ప్రాంత‌మైన గాల్వాన్ లోయ‌లోకి వేల మంది చైనా సైనికులు ప్రవేశించడం తోనే  పరిస్థితి యుద్ధం దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు  భార‌త్ నాయ‌కుల‌తోపాటు సైనిక నిపుణుల‌నూ నిర్ఘాంత‌పోయేలా చేస్తున్నాయి.ఇది సాధార‌ణ చొర‌బాటుకాద‌ని  చైనా చేస్తున్న చర్యలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.  భార‌త్‌లో భాగ‌మేన‌ని ఇదివ‌ర‌కు అంగీక‌రించిన ప్రాంతంలోకి చైనా సేనలు చొచ్చుకు రావడం తీవ్ర పరిణామం గా సైనికాధికారులు భావిస్తున్నారు. 
             చైనా ఇలా ఘర్షణలకు దిగడం ఇదేమి మొదటసారి కాదు. గతం లో కూడా గాల్వాన్ లోయ వద్ద 1962 లో జులై నెలలోనే చైనా సైన్యాలు ఆక్రమించుకోవాలని చూశాయి.. అపుడు కూడా భారత్ సైన్యం అడ్డు గా నిలబడింది. సరైన సమాధానం చెప్పి చైనా మూకల్ని  తిప్పి పంపింది. భారత్  సైన్యం ధాటికి అపుడు కూడా చైనా సైన్యాలు వెనక్కి మళ్ళాయి.. అయితే.. చైనా కాపాతబుద్ధి ని నమ్మడానికి వీలు లేదు.. వెళ్ళినట్లే వెళ్లి తిరిగి  దాడికి దిగింది.. భారత్ తో స్నేహం చేసినట్లే చేసి.. గతం లో ప్రధాని గా చేసిన వాజపేయి నుంచి సమాచారాన్ని దొంగిలించింది. దాడులకు దిగింది.. ప్రధాని మోడీ తో కూడా స్నేహ సంబంధాలు కావాలంటూ కోరింది.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ లో పర్యటనలు కూడా చేశారు.. భారత్ ఆతిధ్యాన్ని కొనియాడారు.. ఇరు దేశాల మధ్య సన్నిహిత్యాలు ఉండాలంటూ కబుర్లు చెప్పారు.. కానీ చైనా ప్రభుత్వం చేస్తున్న చర్యలు మాత్రం నోటి తో మాట్లాడుతూ.. నొసటితో వెక్కిరిస్తున్నట్లు ఉంటాయి.. ప్రస్తుతం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న లొల్లే దానికి నిదర్శనం. 
 
              భార‌త్‌, చైనాల మధ్య‌ 3,400 కి.మీ పొడ‌వైన స‌రిహ‌ద్దు ఉంది. దీని వెంబ‌డి చాలా ప్రాంతాల‌పై స‌రిహ‌ద్దు వివాదాలున్నాయి. స‌రిహ‌ద్దుల వెంబ‌డి రెండు దేశాలు నిర్వ‌హించే గ‌స్తీలు అప్పుడ‌ప్పుడు ఉద్రిక్త ప‌రిస్థితులకు కార‌ణం అవుతుంటాయి. నాలుగు దశాబ్దాల కాలం ఈ సరిహద్దు వద్ద ఒక్క గొడవ కూడా జరగలేదు.. ఒక్క తూటా కూడా పేలలేదు అని రెండు దేశాల ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి.. ప్ర‌పంచంలో అతి పెద్ద సైన్యాలూ చాలాసార్లు ఢీ అంటే ఢీ అంటూ ఎదురుప‌డ్డాయి. రెండు దేశాల మ‌ధ్య ఉండే వాస్త‌వాధీన రేఖ (ఎల్ఏసీ) హ‌ద్దులు చాలాచోట్ల అస్ప‌ష్టంగా ఉంటాయి. న‌దులు, స‌ర‌స్సులు, మంచుతో క‌ప్పి ఉండే ప్రాంతాలతో స‌రిహ‌ద్దులు మారుతుంటూ అప్పుడ‌ప్పుడు ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణం అవుతుంటాయి. అయితే.. చైనా కు భారత్ కు మధ్య వస్తున్న వివాదాలు కూడా సామాన్యమైనవి అని అనుకోవడానికి వీలు లేదు.. ఈ ఘర్షణలను చైనా కావాలనే సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇంత భారీ గా యుద్ధం చేయడానికి చైనా కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభించుకుని ఉండొచ్చని సైనికాధికారులు భావిస్తున్నారు.. ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య క‌నిపిస్తున్న ఉద్రిక్త ప‌రిస్థితులు కేవ‌లం ల‌ద్దాఖ్‌కు మాత్ర‌మే ప‌రిమితం కావు. భార‌త్‌లోని ఈశాన్య రాష్ట్రం సిక్కింతో చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన నాకు లా పాస్‌లోనూ రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఈ నెల మొద‌ట్లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం క‌నిపించింది. ప్రస్తుతానికి.. చైనా లడఖ్ సరిహద్దు వద్ద వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్న.. తిరిగి మరో ప్రాంతం లో అయినా తిరిగి ఘర్షణకు దిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.. గతం లో కూడా.. ఇలానే గాల్వాన్ లోయ వద్ద యుద్ధం జరిగినపుడు..  చైనా మూకలు  వెనక్కి  వెళ్ళినట్లే వెళ్లి.. తిరిగి భారత సైన్యం పై దాడి కి దిగాయి.. చైనా కుటిల బుద్ధి ని ఎప్పటికి నమ్మడానికి వీలు లేదు.
 
                   1962 వ సంవత్సరం లో.. చైనా భారత్ ల మధ్య జరిగిన యుద్ధం లో భారత్ అపజయం పొందింది.. అదొక రాజకీయ వైఫల్యం కూడా... వాస్తవాలను చూసుకోకుండా.. చైనా ప్రభుత్వాన్ని నమ్మడం తో.. చైనా వెన్నుపోటు పొడిచింది.. వెనక్కి తగ్గినట్లే తగ్గి.. భారత్ సైన్యం పై కనివిని ఎరుగని రీతిలో దాడికి దిగింది. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారు కూడా తప్పు జరిగిందని పార్లమెంట్ లో పశ్చాత్తాపం చెందారు. స‌రిహ‌ద్దుల్లో చిన్న‌చిన్న‌ అతిక్ర‌మ‌ణ‌లు, అవ‌త‌లి ప్రాంతాల్లో గ‌స్తీ, ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్పితే చైనా ఇంకేమీ చేయ‌లేద‌ని  తప్పు చేశామని.. స్వయం గా నెహ్రు గారు అంగీకరించారు. 1962 లో హిమాల‌యాల్లో చైనాతో జ‌రిగిన స‌రిహ‌ద్దు యుద్ధాన్ని చూసిన వారెవ‌రూ యాభైయేళ్ల‌యినా దాన్ని అంత తేలిగ్గా మ‌ర‌చిపోలేరు. 1959 న‌వంబ‌రు తొలి వారంలో నే చైనా తో విధ్వంస‌క‌ర రీతిలో ఘర్షణలు చెలరేగాయి.. ల‌ద్దాఖ్‌లోని కోంగ్‌కాలాలో రక్తం ఏరులై పారింది.. ఈ ఘటన కు  చైనా కుటిలబుద్ది కొంత కారణమైతే.. భారత్ నాయకుల రాజకీయ వైఫల్యం కూడా ఓ కారణం.
 
                      ప్రస్తుతం.. తాజా పరిస్థితుల్లో.. చైనా యుద్దానికి తగబడటానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి.. చైనా మొదటి నుంచి కుటిల బుద్ధి తోనే  వ్యవహరిస్తూ వస్తోన్న సంగతి కొత్తదేమీ కాదు.. చైనా కు 19 దేశాలు.. సరిహద్దు లో ఉంటె.. దాదాపు.. భారత్ తో కలిపి 18 దేశాలతో.. సరిహద్దు గొడవలున్నాయి.. అంటే.. చైనా స్వభావం ఏంటో తెలుస్తుంది. అయితే.. మరో వైపు.. అగ్రదేశాలైన అమెరికా, జపాన్, జెర్మనీ వంటి దేశాలు కూడా చైనా కు వ్యతిరేకం గానే ఉన్నాయి..  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నాటినుంచి ... అమెరికా అధ్యక్షుడు.. విదేశాంగ శాఖ  మంత్రులు కూడా చైనా పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. చైనా నే కావాలని ఈ వైరస్ ను సృష్టించి.. ప్రపంచ దేశాలపైకి వదిలిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన వ్యాఖ్యలు వాస్తవమేనంటూ.. పలువురు సమర్ధించసాగారు కూడా.. ఈ నేపధ్యం లోనే.. చైనా కు తొత్తు గా మారిన.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కు నిధులు ఇవ్వడం కూడా మానేశారు. మరో వైపు.. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు.. చైనా ఒక్కటి ఒకవైపు అన్నట్లు గా పరిస్థితులు మారుతూ వచ్చాయి.
 
                        పరిస్థితులన్నీ.. చైనా కు వ్యతిరేకంగా.. భారత్ కు అనుకూలం గా మారుతూ వచ్చాయి.. మేజిక్ డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు భారీ ఉత్పత్తి కేంద్రం అయినా భారత్ దాదాపు 150 దేశాలకు ఈ మందును అందించడానికి ముందుకొచ్చింది. కరోనా కష్టకాలం లో సాయమందించే దేశం గా భారత్ పేరు గడించింది.. మరో వైపు.. అగ్ర దేశాలన్నీ భారత్ కు అండగా నిలవడం పట్ల కూడా చైనా విముఖం గా ఉంది.. చైనా కు కేవలం పాకిస్థాన్ లేదంటే.. ఉత్తర కొరియా దేశాలు మాత్రమే సాయమందిస్తాయి.. అయితే.. ఆ దేశాలు అందించగలిగే సాయం కూడా అంతంతమాత్రమే.. అసలే భారత్ పై గుర్రు గా ఉన్న చైనా పాకిస్థాన్ సైన్యాన్ని కూడా  సమీక్షించుకుని.. యుద్ధనికి తెగబడింది. అయితే.. భారత్ సైన్యం దెబ్బకు.. వెనక్కి మళ్లింది.. ప్రస్తుతం.. అంతర్జాతీయం గా చైనా కు ఉన్న విలువ తగ్గడం.. అగ్ర దేశాలు భారత్ కు అండగా నిలబడుతుండడం తో.. చైనా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. చైనా సైన్యం వెనక్కి మరలినా ఇంకా ఆయుధ సామాగ్రి ని అక్కడే ఉంచింది. ప్రస్తుతం.. భారత్ సైన్యం తమ గస్తీ ని తగ్గించలేదు.. ఆ ఆయుధ సామగ్రి పై భారత్ ఓ కన్నేసే ఉంచింది.
 
                  ప్రస్తుతం.. చైనా వెనక్కి తగ్గినా చైనా ను నమ్మడానికి వీలు లేదు.. గతం లో భారత్ కు ఎదురైనా అనుభవాలే అందుకు నిదర్శనం.. కరోనా కష్టకాలం లో చైనా వ్యవహరించిన తీరు పై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి.. చైనా తన వక్ర బుద్ధి ని తానె బయట పెట్టుకుంది.. భారత్ మాత్రం తన జాగ్రత్త్తలోనే తానూ ఉంది.. భారత్ సైన్యం కూడా సమర్ధవంతమైనదే.. త్వరలోనే ఈ గడ్డు కాలం నుంచి భారత్ బయటపడాలని కోరుకుందాం..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox