Breaking News

యూపీలో గతంలో ఆవులు, గేదెలకు కూడ రక్షణ లేదు.. సీఎం యోగి ఆదిత్యనాథ్

14 th Sep 2021, UTC

 ఉత్తరప్రదేశ్ లో  గతంలో 'ఆవులు మరియు గేదెలు' కూడా  సురక్షితంగా లేవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తన ప్రభుత్వ అభివృద్ధిని ప్రస్తావిస్తూ,గతంలో కంటే ఇపుడు యూపీలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని చెప్పారు. గతంలో పశ్చిమ యూపీ గుండా ఒక సాధారణ ఎద్దుల బండి వెళ్లినా, ఆవులు మరియు గేదెలకు కూడ భద్రత వుండేదికాదు.  నేడు ఎవరైనా బలవంతంగా కిడ్నాప్ చేయగలరా?  అని యోగి ప్రశ్నించారు.

గతంలో యూపీ యొక్క ఇమేజ్ ఏమిటి? . సాయంత్రం చీకటి  పడితే  ఏ నాగరిక వ్యక్తి అయినా రాత్రి వీధుల్లో నడవడానికి భయపడేవాడు. కానీ ఈరోజు  అలాంటి పరిస్దితి లేదని  ఆయన అన్నారు. ఇలా వుండగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరలా గెలిచి  అధికారం చేపట్టాలని యోగి సారధ్యంలో బీజేపీ భావిస్తోంది. అయితే ఈ సారి బీజేపీ కి అధికారం దక్కకూడదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

సుహెల్దేవ్ భారతీయ సమాజ్, ఏఐఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ,ఆప్, శివసేన మరియు జెడియు వంటి పార్టీలు యుపి ఎన్నికల్లో  పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox