Breaking News

నేను ‘ బజ్రా రోటిస్’ తిన్నా, నాకు కరోనా భయం లేదు : మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే

23 rd Feb 2021, UTC

మధ్య ప్రదేశ్ లో కూడా కొవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తూ కనిపించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి), కాంగ్రెస్, అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర అసెంబ్లీ  బయట ఎలాంటి మాస్క్ లు లేకుండా కనిపించారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, తానెప్పుడూ మాస్క్ ను ధరించలేదని పేర్కొన్నారు. తనకు కరోనా వ్యాధి లేదని, తానెప్పుడూ మాస్క్ వేసుకోలేదని, ఇకపై వేసుకోనని ఆయన చెప్పారు. ఒకవేళ తనకు ఫైన్ పడితే, కచ్చితంగా ఫైన్ ను కడతానని చెబుతున్నారు. అంతే కాదు, కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పాఠశాలలను, కళాశాలలను ఎందుకు తెరుస్తున్నారని, వివాహాలకు ఎందుకు అనుమతులిస్తున్నారని ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరో కాంగ్రెస్ శాసనసభ్యుడు, చంబల్ జిల్లాకు చెందిన బజినాథ్ కుష్వాహా, “మేము బజ్రాకి రోటీ తింటాము, కరోనావైరస్ మమ్మల్ని ప్రభావితం చేయదు” అని అన్నారు. మాస్క్ లేకుండా కనిపించిన బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి, ముసుగు వేసేటప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నందున మాస్క్ ధరించడం అసౌకర్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox