Breaking News

గంగూలీకి ఫ్లాట్ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు

28 th Sep 2021, UTC

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్ ను కలకత్తా హైకోర్టు  రద్దు చేసింది. ఒక విద్యా సంస్థను స్థాపించడానికి అతనికి  ఈ ఫ్లాట్ ను కేటాయించారు.  కోర్టు 5పశ్చిమ బెంగాల్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కొక్కరికి రూ .50,000 జరిమానా, అలాగే గంగూలీ మరియు అతని ఫౌండేషన్‌పై రూ. 10,000 జరిమానా  విధించింది.

ప్లాట్‌ల కేటాయింపు ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా లేదని కోర్టు అభిప్రాయపడిందిప్లాట్‌ని  ఆస్తిగా కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా "కళ్ళు మూసుకుని" కేటాయించారని కోర్టు పేర్కొంది.గంగూలీ భారతదేశానికి పురస్కారాలను తెచ్చినప్పటికీ, "చట్టానికి అతీతంగా ఎవరూ ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందలేరు, ప్రత్యేకించి వాణిజ్య సంస్థల కోసం ప్లాట్ల కేటాయింపు కోసం అని కోర్టు స్పష్టం చేసింది. క్రీడలు, ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధిపై సౌరవ్ గంగూలీకి ఆసక్తి ఉంటే అనేక రాష్ట్ర క్రీడా సంస్థలు ఉన్నాయి.అతను వారితో  కలిసి  వర్ధమాన క్రికెటర్లను ప్రేరేపించగలడు" అని కోర్టు తీర్పు చెప్పింది.

గంగూలీ అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించడానికి కోల్‌కతాలో 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని 2012 జూలైలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కోరారు.  దీనికోసం సౌరవ్ గంగూలీ చెల్లించాల్సిన లీజు ప్రీమియం రూ. 10.98 కోట్ల నుండి రూ. 5.27 కోట్లకు తగ్గించారు.గంగూలీకి ఫ్లాట్ కేటాయింపుపై పిల్ దాఖలవడంతో విచారించిన హైకోర్టు పై విదంగా తీర్పు నిచ్చింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox