Breaking News

పెట్రో ధరలతో దోచుకోవడం కాదు. ఊరట నివ్వండి:సోనియా గాంధీ

29 th Jun 2020, UTC
పెట్రో ధరలతో దోచుకోవడం కాదు. ఊరట నివ్వండి:సోనియా గాంధీ

పెట్రో పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రజలు వెచ్చించిన ఖర్చులతో ప్రభుత్వం లాభాలను ఆర్జిస్తోందని, కష్ట సమయాల్లో ప్రజలకు సహాయం చేయాలి కానీ, లాభాలు ఆర్జించవద్దని ఆమె కేంద్రానికి సలహా ఇచ్చారు. పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రారంభించిన క్యాంపెయిన్‌లో సోనియా మాట్లాడారు.

పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచి, ప్రజల నుంచి నూత్న విధానంలో ప్రభుత్వం దోచుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇలా చేయడం కేవలం అన్యాయం మాత్రమే కాదని, అత్యంత సున్నితమైన అంశమని కూడా పేర్కొన్నారు. పెట్రో పెంపు దేశ పౌరులను, రైతులను, పేద ప్రజలను, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా బాధిస్తోందని ఆమె అన్నారు.

లాక్‌డౌన్ తర్వాత, మూడు నెలల్లో 22 సార్లు పెట్రో ధరలను పెంచింది కేంద్రం. డీజిల్ లీటర్‌కు 11 రూపాయలు, పెట్రోల్ లీటర్‌కు 9.12 రూపాయలను పెంచింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సరే... ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుతోంది అని సోనియా గాంధీ మండిపడ్డారు.

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంటే... మరోవైపు పెట్రో ధరలను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. పెంచిన పెట్రో ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులం మోదీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెట్రో ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని కూడా తగ్గించి ప్రజలకు ఊరటనివ్వండి. ఈ ఆర్థిక సంక్షోభంలో ఇదే పెద్ద ఊరట అని  ఆమె డిమాండ్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox