Breaking News

పరిష్కరం కావాలి.. పసలేని ప్రసంగాలు కాదు.. రాహుల్ గాంధీ

22 nd Apr 2021, UTC

మంగళవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎంపీ పసలేని, నిరాశపూరిత ప్రసంగంగా అభివర్ణించారు.నేను ఇంట్లో నిర్బంధంలో ఉన్నాను దేశవ్యాప్తంగా విషాద కథలు వినబడుతున్నాయి. భారతదేశం కేవలం కరోనా వైరస్ సంక్షోభానికేకాకుండా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దెబ్బతింది. దేశానికి పసలేని ప్రసంగాలు,  పనికిరాని పండుగలు అవసరం లేదు. భారతదేశానికి పరిష్కారం అవసరం అంటూ రాహుల్  హిందీలో ట్వీట్‌ చేసారు

వ్యాక్సిన్ కవరేజీని పెంచడానికి ఈ నెల మొదట్లో ప్రభుత్వం నాలుగు రోజుల "టికా ఉత్సవ్"ను నిర్వహించడాన్ని  ఆయన ప్రస్తావించారు. మంగళవారం మోదీ టెలివిజన్ ప్రసంగంలో, కోవిడ్ ఇన్ఫెక్షన్ల తీవ్ర ఆందోళనల మధ్య వైద్య ఆక్సిజన్, హాస్పిటల్ పడకలు మరియు వ్యాక్సిన్ల లభ్యత గురించి దేశానికి హామీ ఇచ్చారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావిస్తూ లాక్ డౌన్ అనేది చివరి అస్త్రమని అన్నారు.

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా గత వారం, కోవిడ్ ఉప్పెన పై ప్రభుత్వాన్ని నిందించారు. ప్రభుత్వం దీన్ని సరిగా ఎదుర్కొనలేకపోయిందని ఆరోపించారు .కోవిడ్ సంక్షోభంపై పోరాడటానికి ఐదు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం పిఎం మోడీకి లేఖ రాశారు.  అయితే, ఈ విమర్శలను  ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్  తిప్పికొట్టారు మీ విలువైన సలహాలను ఇటువంటి  అసాధారణ సమయాల్లో కాంగ్రెస్ నాయకులు  అనుసరించినట్లయితే చరిత్ర మీపట్ల దయగా వుంటుంది  మన్మోహన్ సింగ్ జి! అంటూ ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox