Breaking News

భారత్ లో కరోనా కొత్త రూపాలు... మొత్తం 198 రకాలు..!

05 th Jun 2020, UTC
భారత్ లో కరోనా కొత్త రూపాలు... మొత్తం 198 రకాలు..!
కరోనా మహమ్మారి భారత్ లో తన పంజా విసిరింది,.ప్రాంతానికో రూపాన్ని మార్చుకుంటూ వస్తోన్న కరోనా భారత్ లో ఏకంగా 198 రకాలను సృష్టించింది. ఇటీవల.. జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  ఈ సంచలన నిజాన్ని బయట పెట్టింది. అయితే.. వీటిలో.. ఒక్క తెలంగాణ లోనే 55 రకాల వైరస్ లు ఉన్నాయట. ఈ మహమ్మారి తెలంగాణ లో 55 రకాలుగా తన జన్యువుని మార్చుకుని మార్పులు చెందుతూ వ్యాప్తి చెందుతుంది. కరోనాకు చెందిన 400 జన్యువుల విశ్లేషణ తరువాత.. ఈ నిర్ధారణకు వచ్చామని జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తెలిపింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా మళ్లీ పాకుతోంది. 
          దేశంలో అత్యధికంగా జన్యుమార్పులకు గురైన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. గుజరాత్‌లోని ఒక్క అహ్మదాబాద్‌లో 60 రకాల కరోనా వైరస్‌లు ఉన్నట్లు గుర్తించింది. ఇక ఢిల్లీలో 39 రకాలు, మహారాష్ట్రలో 15 రకాల వైరస్‌లు ఉన్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox